
వాట్సాప్ బీటా వెర్షన్ 2.26.14.1లో కొత్తగా నాయిస్ కాన్సిలేషన్ అనే ఫీచర్ వచ్చింది. వాయిస్, వీడియో కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. ఈ ఫీచర్ ట్రాఫిక్, ఎయిర్,చుట్టుపక్కల ఉన్న ఇతర శబ్దాలను రియల్ టైమ్‌లో ఫిల్టర్ చేస్తుంది. తద్వారా కాల్స్ సమయంలో వాయిస్ మరింత స్పష్టంగా వినిపిస్తుంది.ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుంది. ఒకవేళ ఆడియోను మరీ ఎక్కువగా ఫిల్టర్ చేస్తుంటే కాల్ సమయంలో ఆఫ్ చేసేందుకు ఆప్షన్ కూడా ఉంది.
ఈ వాట్సాప్ ఫీచర్ యూజర్లు పంపే ఆడియోలో అవతలి వ్యక్తికి మీరు చెప్పేది స్పష్టంగా వినిపిస్తుంది. అయితే, ఆ యూజర్ ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయకపోతే ఆడియో క్లారిటీ సరిగా ఉండదు. అందుకే వాట్సాప్ యూజర్లు ఇద్దరూ తప్పనిసరిగా తమ ఫోన్లలో ఈ ఫీచర్ ఎనేబుల్ చేసి ఉండాలి. ఈ ప్రాసెసింగ్ పూర్తిగా డివైజ్‌లోనే జరుగుతుంది. మైక్రోఫోన్ నుంచి వచ్చే ఆడియోను మొదట ఫిల్టర్ చేస్తుంది. ఆపై పంపే ముందు ఎన్‌క్రిప్ట్ అవుతుంది. దాంతో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రైవసీ ఉంటుంది. ఈ ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్ కోసం రిలీజ్ కానుంది. రాబోయే వారాల్లో బీటా యూజర్లకు రిలీజ్ అవుతుంది. ఆపై రెగ్యులర్ యూజర్లకు స్టేబుల్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది.