Reading Time: < 1 minute

మహారాష్ట్ర : ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. శనివారం ముంబాయి లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ ఆశా భోస్లే ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1933 లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి ఆశా భోస్లే. ఏడుసార్లు ఫిల్మ్ గెలుచుకున్నారు. రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు, 2000 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మభూషణ్ ఫురస్కారం అందుకున్నారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా బాలీవుడ్ చిత్రాలకు పాటలు పాడారు. ఆశా భోస్లే కన్నుమూసినట్లు కుటుంబు సభ్యులు ధ్రువీకరించారు. సోమవారం ఉ.11 నుంచి అభిమానుల సందర్శనార్థం స్వగృహంలో ఆశా భోస్లే భౌతికకాయం ఉండగా..సాయంత్రం 4 గం.లకు ముంబయి శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు జరగనున్నాయి.