Reading Time: < 1 minute

భువనేశ్వర్: కుమారుడు, కుమార్తెను కసాయి తల్లి చంపిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కన్నతల్లి కాటికి పంపిస్తుందని అనుకోలేదు. ఝూర్సుగూడలోని తంగరపల్లి గ్రామంలో రంజిత అనే మహిళ, భర్త కుమారుడు బిభాన్షు(06), కుమార్తె జిజ్ఞాస (10) కలిస జీవిస్తోంది. శనివారం రాత్రి భర్తను లేపి బయటకు రమ్మని పిలించింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లి గడియ వేసుకుంది. కూతురు, కుమారుడిని పదునైన ఆయుధంతో దాడ చేసి చంపేసింది. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకుంది. లోపల నుంచి కేకలు వినపడడంతో భర్త ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. గ్రామస్థులు డోర్ బద్దలు కొట్టి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో కనిపించారు. భార్య కొన ఊపిరితో ఉండడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.