Reading Time: < 1 minute
Watch Video: భార్య కాపురానికి రావట్లేదని భర్త మాస్టర్ ప్లాన్ .. ఏం చేశాడో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!

భార్యను కాపురానికి పంపడం లేదని అత్తను కరెంట్ షాక్‌తో చంపడానికి అల్లుడు ప్రయత్నించిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి.. 25 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన పద్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లల సంతానం. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి మల్లారెడ్డి, భార్య పద్మతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పెట్టే హింసను భరించలేక తన పిల్లలను తీసుకొని తన తల్లి అయిన గడ్డం రాజవ్వ ఇంటికి వెళ్ళింది పద్మ.

అయితే అక్కడికి వెళ్లిన మల్లారెడ్డి, ఆమెను చంపుతా అని బెదిరించారు. దీంతో భయపడి పోయిన పద్మ రెండు నెలల క్రితం గొల్లపల్లిలోని మేనమామ ఇంటి వద్దకు వెళ్లి అక్కడే ఉంటుంది. దాంతో తన అత్త అయిన గడ్డం రాజవ్వ తన భార్యను రాకుండా చేస్తుందని, తన అత్తను చంపితే తన భార్య తిరిగి ఇంటికి వస్తంది అనుకున్నాడు మల్లారెడ్డి. ఎలాగైనా అత్త రాజవ్వని చంపాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 10 రోజున రాత్రి అందరూ పడుకున్న తర్వాత రాజవ్వ నివాసం ఉంటున్న ఇంటి దర్వాజా ముందు రెండు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్ పెట్టి, ఆవైర్‌ను కరెంట్ పోల్‌కి కనెక్షన్ ఇచ్చాడు.

అత్త లేచి తలుపులు తెరియగానే కాలు తగిలితే చనిపోయే విధంగా అమర్చినాడు. అయితే ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచిన రాజవ్వ తలుపులు తీసి కాలుకు కరెంట్ షాక్ తగిలినట్టు అనిపించగా వెంటనే చుట్టూ పక్కల వారిని పిలిచింది. వాళ్లు ఆ వైర్లను వెంటనే తొలగించారు. అయితే ఇది అల్లుడు చేసిన పనేనని గ్రహించిన రాజవ్వ మల్లారెడ్డిపై వెల్గటూర్ పోలీస్ స్టేషన్ లో అతని పై ఫిర్యాదు చేసింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి