Reading Time: < 1 minute

ఆర్టీసీ బస్సులో కాశీ, అయోధ్య యాత్ర

Caption of Image.

మల్కాజిగిరి, వెలుగు: భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక కాశీ, అయోధ్య యాత్రను ప్రకటించింది. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ఈసీఐఎల్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరే సూపర్ లగ్జరీ బస్సు.. మయ్యర్, ప్రయాగరాజ్, కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, ఉజ్జయిని మహంకాళి, ఓంకారేశ్వర్ వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించి, తిరిగి ఈ నెల 22న హైదరాబాద్ చేరుకుంటుంది. ఎయిర్ సస్పెన్షన్, పుష్​బ్యాక్ సీట్ల వసతి కలిగిన ఈ బస్సు టికెట్ ధరను పెద్దలకు రూ.8 వేలుగా, పిల్లలకు రూ.6 వేలుగా నిర్ణయించారు.

వసతి, భోజనం, దర్శన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనదలచిన వారు మరిన్ని వివరాలు, ముందస్తు బుకింగ్ కోసం 9959226145, 9603549388 నంబర్లను సంప్రదించాలని కుషాయిగూడ డిపో మేనేజర్ వేణుగోపాల్ సూచించారు.

©️ VIL Media Pvt Ltd.