
కిరాతుడైన బోయవాడు జంట పక్షులలో ఓ పక్షిని వేటాడగా.. దాని జంటపక్షి విలపించిన తీరును చూసి చలించిపోయాడు. కన్నీటితో వాటికి నివాళి అర్పించి వేటను వదిలి మానవత్వం పరిమలించగా కవిగా మారాడు. అద్భుతమైన రామాయణాన్ని రచించాడు. అందుకే మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా ఆ మహాకవి రూపాన్ని చూడగానే నమస్కరించకుండా ఉండలేరు. శ్రీసత్యసాయి జిల్లాలో అదే జరిగింది. వాల్మీకి విగ్రహం చుట్టూ ఎలుగుబంట్లు ప్రదక్షిణలు చేశాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ సక్తికర ఘటన జరిగింది. వాల్మీకి విగ్రహం దగ్గరకు వచ్చిన ఎలుగుబంట్లు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ఆ తర్వాత తిరిగి వెళుతూ లేచి నిలుచుని నమస్కరించి వెళ్లాయి. ఎలుగుబంట్లు వచ్చి వెళ్లిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ వీధికుక్కకు అమెరికన్లు ఫిదా.. శాంతియాత్రలో శునకం
మూడు గంటలు తాటిచెట్టుపై వేలాడుతూ గీత కార్మికుడు
78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు