
తెలుగు సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన సినిమా అది. ఈ సినిమా చిత్రం విడుదలైన ఇప్పటికే 75 వసంతాలు పూర్తి చేసుకుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే, ప్రతిసారీ కొత్తగా అనిపించే చిత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. 1951 మార్చి 15న 13 ప్రింట్లతో విడుదలైన ఈ జానపద కళాఖండం, నాటి ప్రేక్షకుడికి పంచభక్ష పరమాణాలు వడ్డించి, క్లాసిక్ సినిమాల జాబితాలో అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఆ సినిమా మరేదో కాదు నందమూరి తారక రామారావు నటించిన పాతాళభైరవి. దర్శకుడు కె.వి. రెడ్డికి తొలినాళ్లలో జానపద చిత్రాలపై ఆసక్తి లేనప్పటికీ, యోగివేమన విజయం ఆయనను ఈ దిశగా ప్రేరేపించింది. బాలనాగమ్మ కథ కార్యరూపం దాల్చకపోయినా, గుణసుందరి విజయం సాధించింది. మాంత్రికుడి కథపై ఆయన మక్కువ తగ్గలేదు.
సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు
విజయ బ్యానర్‌పై చక్రపాణి, నాగిరెడ్డిల ఆహ్వానంతో, ఆస్థాన రచయిత పింగళి నాగేంద్రరావుతో కలిసి అరేబియన్ నైట్స్ కథలు, కాశీమజిలీ కథల స్ఫూర్తితో పాతాళభైరవి కథను సిద్ధం చేశారు. నటీనటుల ఎంపిక కూడా ఆసక్తికరంగా జరిగింది. నాగిరెడ్డి మొదట అక్కినేని నాగేశ్వరరావును తోటరాముడిగా, గోవిందరాజుల సుబ్బారావును నేపాల మాంత్రికుడిగా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్‌తో అప్పటికే రెండేళ్లకు నాలుగు సినిమాలకు (పాతాళభైరవి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం, వాహిని వారి మల్లీశ్వరి) నెలకి రూ. 250 పారితోషకానికి ఒప్పందం కుదిరింది. హీరో ఎంపికలో నిర్ణయం తీసుకోలేని స్థితిలో, సంసారం షూటింగ్ సమయంలో వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులు టెన్నిస్ ఆడుతుండగా, ఎన్టీఆర్ కసిగా బంతిని బాదిన తీరును చూసిన కె.వి. రెడ్డికి తోటరాముడి పాత్రకు ఎన్టీఆర్ సరైన ఎంపిక అని ఫిక్స్ అయ్యారట. ఒక సన్నివేశాన్ని చిత్రీకరించి, రష్ చూశాక ఎన్టీఆర్‌ను ఖరారు చేశారట.
ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్
మాంత్రికుడి పాత్రకు ఎస్.వి. రంగారావును ఎంపిక చేశారు. వరూధిని పరాజయం పాలవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రంగారావులోని ప్రతిభను గుర్తించి, గెటప్ టెస్ట్ చేయించి, ఆయనను మాంత్రికుడిగా ఎంపిక చేశారు. హాస్యనటుడు బాలకృష్ణ (అంజీగాడు), రేలంగి, పద్మనాభం, సురభి కమలాబాయి (తోటరాముడి తల్లి), మాలతి (నాయిక ఇందు) వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ ఈ చిత్రానికి సౌండ్ అసిస్టెంట్‌గా పనిచేయడం గమనార్హం. ఈ చిత్రం సాంకేతిక విలువల్లోనూ ఒక మైలురాయి. మార్కస్ బార్ట్లే సినిమాటోగ్రఫీ, పింగళి నాగేంద్రరావు రాసిన మాటలు, ఘంటసాల స్వరపరిచిన పాటలు అజరామరం. పాతాళభైరవి పది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని, తెలుగులో నేరుగా 25 వారాలు ఆడిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.