Reading Time: < 1 minute
Stock Market Crash Middle East Tensions Iran Us Talks Failure

దేశీయ స్టాక్ మార్కెట్‌కు పశ్చిమాసియా టెన్షన్ వెంటాడుతోంది. గత కొద్దిరోజులుగా మార్కెట్‌కు యుద్ధ భయం పట్టుకుంది. దీంతో ఇప్పటికే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇటీవల రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో మార్కెట్ పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే తాజాగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో వార్ టెన్షన్ పట్టుంది. దీంతో ఈ వారం ప్రారంభంలో కూడా మార్కెట్‌‌ను ఆందోళన కలిగించింది. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు దాకా అదే ఒరవడి కొనసాగింది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 702 పాయింట్లు నష్టపోయి 76, 847 దగ్గర ముగియగా.. నిఫ్టీ 207 పాయింట్లు నష్టపోయి 23, 842 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 65 పైసలు తగ్గి 93.38 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Amit shah: అధికారంలోకి రాగానే బెంగాల్ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటన

నిఫ్టీలో హెచ్‌డిఎఫ్‌సీ లైఫ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అగ్రగామిగా లాభపడగా.. మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ వంటివి నష్టపోయాయి. రంగాల్లో విద్యుత్, రక్షణ, టెలికాం మినహా ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఐటి, ఇంధనం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు ఒక్కొక్కటి 1 శాతం చొప్పున తగ్గడంతో మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.

ఇది కూడా చదవండి: RBI New UPI Rule: ఆర్బీఐ కొత్త ప్లాన్‌.. UPI చెల్లింపుల్లో కీలక మార్పులు..!