
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత మాజీ సిఎం కెసిఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు జారీ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైళ్ల కొనుగోలుతో తనకు సంబంధం లేదని సీతక్క అన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కెసిఆర్‌దే బాధ్యత అని సూచించారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని సీతక్క హెచ్చరించారు.