Reading Time: < 1 minute

ఇక సెలవు.. ముగిసిన ఆశా భోస్లే అంత్యక్రియలు

Caption of Image.

ముంబై: భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం (ఏప్రిల్ 13) సాయంత్రం ముంబైలోని శివాంజీ పార్క్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. కుమారుడు ఆనంద్ భోస్లే తల్లి చితికి నిప్పంటించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆమిర్ ఖాన్ , విక్కీ కౌశల్, అనూప్ జలోటా, షాన్, వివేక్ ఒబెరాయ్ తదితర బాలీవుడ్, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు  శివాంజీ పార్క్ శ్మశానవాటికకు చేరుకుని ఆశా భోస్లే పార్థివ దేహానికి కడసారి నివాళులు అర్పించారు. 

అంతకముందు ఆశా భోస్లే నివాసం నుంచి దాదర్‌లో ఉన్న శివాజీ పార్క్ శ్మశానవాటిక వరకు భారీ జనసందోహం నడుమ ఆమె అంతిమయాత్ర సాగింది. భారత సంగీత శిఖరాన్ని కడసారి చూసేందుకు పలువురు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అంతిమయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముంబై గల్లీలన్ని ఆశాభోస్లే అమరా హే నినాదాలతో మోరుమోగిపోయాయి. ఆశ్రునయనాలతో గాన కోకిలకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. 

 కాగా, అనారోగ్యంతో భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) ఏప్రిల్ 12న కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆమె తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‎తో ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. 

 

©️ VIL Media Pvt Ltd.