
డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. సోమవారం(ఏప్రిల్ 13) తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2026 నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, జూన్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు సబ్జెక్టుల వారిగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు కంప్యూటర్ అధారిత పద్ధతి(సిబిటి)లో నిర్వహిస్తారు.