Reading Time: < 1 minute
హీరోగా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి.. పరమపద సోపానం రిలీజ్ ఎప్పుడంటే

‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు.ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు అర్జున్ అంబటి. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ సంస్థ పై గణపర్తి నారాయణరావు తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

పులగం సుప్రియ సహ నిర్మాత. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ ‘పరమపద సోపానం’ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ శివ.

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

ఇక మాస్ మహారాజ్ రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన  ‘చిన్ని చిన్ని తప్పులేవో’ ‘భూమ్ భూమ్’ వంటి లిరికల్ సాంగ్స్ కి అలాగే టీజర్ కి విశేషాధారణ లభించింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా చిత్ర బృందం ఒక పోస్టర్ ను వదిలారు. ఇందులో హీరో అర్జున్ అంబటి లుక్ ఇంటెన్స్ ఫీల్ కలిగిస్తుంది. అలాగే కథ, కథనాల పై కూడా అవగాహన కలిగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ కి విశేషాదరణ లభిస్తుంది.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.