Reading Time: < 1 minute

మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడం కాంగ్రెస్ డిఎన్‌ఏలోనే ఉం దని బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడు, రాజ్యస భ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ దొంగ నీతికి పాల్పడుతున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఎస్‌సి, ఎస్‌టిల రాజకీయ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని ఆయన విమర్శించారు. నారీ శక్తి వందన్ అధినియంపై సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) అమలు విషయంలో సిఎం రేవంత్ రెడ్డి,

కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని తీవ్రం గా విమర్శించారు. రాజకీ య లబ్ధి కోసమే ఈ చారిత్రాత్మక బిల్లును కాంగ్రెస్ అడ్డుకునే ప్రయ త్నం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు.గత 30 ఏళ్లు గా ఏదో ఒక సాకుతో మహిళా బిల్లు ను కాంగ్రె స్ అడ్డుపడుతున్నదని ఆయన గుర్తు చేశారు. యూపీఏ హయాంలో సోనియా గాం ధీ మహి ళా చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ, కూ టమి పార్టీల పేరు చెప్పి వెనక్కి తగ్గారే తప్ప, మ హిళా సాధికారతపై, రిజర్వేషన్ల అమలుపై వారికి ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.