Reading Time: < 1 minute

హైదరాబాద్‌: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్(91) భారీ అర్ధ శతకంతో చెలరేగాడు. ఇషాన్ తోపాటు క్లాసెన్ (40), నితీశ్ రెడ్డి (28), సలీల్(23 నాటౌట్) రాణించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.