Reading Time: < 1 minute

స్టార్ హీరో – ఎన్టీఆర్, ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న సినిమా ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్). కాగా ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ రద్దయిందన్న వదంతులను చిత్ర నిర్మాతలు ఖండించారు. తాజాగా ఫ్యాన్స్ ఉత్సాహానికి మరింత జోష్‌ని జోడిస్తూ, ఒక పవర్‌ఫుల్ జిమ్ ఫోటోతో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. విశాలమైన భుజాలు, సన్నని నడుముతో ధృఢమైన ఫిజిక్‌లో ఎన్టీఆర్ కనిపించడం విశేషం. మొత్తానికి క్లాసిక్ బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజులో ఎన్టీఆర్ బ్యాక్ ఫోటో నిజంగా అదిరింది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది.

ఆయన తీసిన కేజిఎఫ్, సలార్ ఇలాగే సాగాయి. కాబట్టి, ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ తోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.