Reading Time: 2 minutes
చరణ్, బన్నీ, తారక్ మధ్య వార్.. కారణం అతడే

రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యూచర్ లైనప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలను ఆల్రెడీ లైన్‌లో పెట్టారు.. మరోవైపు హిందీ నుంచి ఒకరిద్దరు దర్శకులు టాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. ఒకవైపు త్రివిక్రమ్, లోకేష్ కనగరాజ్.. మరోవైపు సంజయ్ సంజయ్ లీలా భన్సాలీ.. ఈ దర్శకుల మధ్య స్టార్స్ నలిగిపోతున్నారు. మరి ఈ ముచ్చట్లేంటో చూద్దామా..? సంజయ్ లీలా భన్సాలీ, త్రివిక్రమ్ కారణంగా చరణ్, తారక్, బన్నీ మధ్య పెద్ద కన్ఫ్యూజన్ డ్రామా నడుస్తుందిప్పుడు. రాకా పూర్తి చేసిన వెంటనే లోకేష్ కనగరాజ్‌తో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లైన్లో పెట్టారు బన్నీ. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫిక్స్ కావడంతో.. త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ నుంచి బన్నీ బయటికొచ్చినట్లే తెలుస్తుంది. ఇందులో తారక్ దాదాపు ఖాయమైపోయినట్లే. అంతా బానే ఉన్నా.. అసలైన సస్పెన్స్ అంతా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. ఈ ముగ్గురూ భన్సాలీ నెక్ట్స్ లిస్టులో ఉన్నారు. ఇందులో బన్నీ, తారక్ లైనప్‌లో రెండు ఫిక్స్ అవ్వగా.. భన్సాలీతో సినిమా చేసే అవకాశం రామ్ చరణ్‌కు దక్కుతుందా లేదంటే అల్లు అర్జున్ ఎగరేసుకుపోతారా అన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. విజయేంద్ర ప్రసాద్ అందించిన ఒక కథతో రామ్ చరణ్, భన్సాలీ కాంబో సెట్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి పోటీగా బన్నీ ముంబైలో భన్సాలీని ఈ మధ్యే కలవడం చూస్తుంటే.. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీ నడుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు తారక్ పేరు కూడా భన్సాలీ లిస్టులో ఉంది. ప్రస్తుతానికి భన్సాలీ రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో.. ఈ మెగా సస్పెన్స్‌కు ఇప్పట్లో తెరపడేలా లేదు. ముందు ఆ హిందీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకే టాలీవుడ్ స్టార్స్‌తో భన్సాలీ అసలు గేమ్ స్టార్ట్ కానుంది. ఈ లోపు చరణ్ కూడా సుకుమార్ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవుడి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో టాలీవుడ్ భామలు

ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్‌లు

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం