
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (ఉప్పల్) స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ తొలుత బ్యాటింగ్ చేసేందుకు రానుంది. ఈ మ్యాచులో గెలిచి ఓరుస ఓటములకి బ్రేక్ వేయాలని SRH చూస్తుండగా, రాజస్థాన్ మాత్రం ఈ గెలుపుతో తమ జైత్రయాత్రని కొనసాగించాలని బరిలోకి దిగుతుంది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. ఈ సీజన్‌లో ఈ వికెట్‌ను వాడటం ఇదే మొదటిసారి.. ప్రారంభంలో పిచ్ కొంచెం స్టిక్కీగా ఉంటుందని ఆశిస్తున్నాం.. గతంలో ఇక్కడ చాలా స్కోర్లను ఛేజ్ చేశాం.. సంగక్కర ఆధ్వర్యంలో తాను వ్యూహాత్మక విషయాలు నేర్చుకున్నానని, ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతను ఆస్వాదిస్తున్నానని పరాగ్ చెప్పుకొచ్చాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. నేను అండర్-19 ఇండియా టీమ్‌కు, అలాగే నా స్టేట్ టీమ్‌కు కూడా చాలా కాలం నాయకత్వం వహించాను.. కాబట్టి ఈ బాధ్యత నాకు కొత్తేమీ కాదు.. కెప్టెన్‌గా ఉంటే ఆటపై మరింత ఫోకస్ పెరుగుతుంది.. జట్టులో ఉన్నప్పుడు ఇది ఎప్పుడూ వ్యక్తిగత ప్రదర్శన గురించి కాదు, టీమ్ వర్క్ గురించి మాత్రమే.. కెప్టెన్సీ వల్ల ప్లేయర్‌లో మెచ్యూరిటీ (పరిణతి) పెరుగుతుంది.. గత కొన్నేళ్లుగా నేను కెప్టెన్‌గా వ్యవహరించడం వల్ల నాలో ఆ మార్పు వచ్చింది.. ఇక గత మ్యాచ్‌తో పోలిస్తే హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు జరిగాయి, అందులో భాగంగా ప్రఫుల్ హింజ్ జట్టులోకి వచ్చాడని ఇషాన్ ధృవీకరించారు.
ఇరు జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే
🚨Toss update from Hyderabad🚨@rajasthanroyals have won the toss and elected to field first against @SunRisers
Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/s1QTySIOh6
— IndianPremierLeague (@IPL) April 13, 2026