Reading Time: < 1 minute

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌ వేర్వేరు అంశాలు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా కోటాను తక్షణమే అమలు చేస్తే దేశమంతా దానిని స్వాగతిస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని నరేంద్రమోడీకి సిఎం రేవంత్‌ లేఖ రాశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో బిజెపికి లాభం జరగొచ్చునని విమర్శించారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలే మిన్నగా ఉండాలని, డీలిమేషన్ కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు.