
ఈ సంవత్సరం జూన్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్ (Womens T20 World Cup) జరగనుంది. ఇందుకోసం ఇవాళ (2026, ఏప్రిల్ 13న) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో విజేతలకు అందజేసే ప్రైజ్‌మనీని రికార్డు స్థాయిలో పెంచినట్లు వెల్లడించింది. 2 నెలల పాటు ఇంగ్లాండ్, వేల్స్‌లో జరిగే ప్రపంచ కప్ కోసం సుమారు 82 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు తెలియజేసింది ఐసీసీ. గత సీజన్‌తో పోలిస్తే సుమారు 10 శాతం ప్రైజ్‌మనీ పెరిగింది.
ఈసారి ఈ మెగా టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. 2024లో కేవలం 10 టీమ్స్ మాత్రమే పాల్గొన్నాయి. జూన్ 12వ నుంచి జూలై 5వ తేదీ వరకు ఏడు వేదికల్లో టోర్నీ కొనసాగనుంది. లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా గత వరల్డ్‌కప్‌లో ప్రైజ్‌మనీ 74 కోట్లు ఉండగా, ఈసారి దాన్ని 82 కోట్లకు పెంచినట్లు ఐసీసీ ప్రకటించింది. వరల్డ్‌కప్ విజేతలు ఈసారి 21.8 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నారు. ఇక రన్నరప్ జట్టుకి 10 కోట్ల రూపాయలని ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
అయితే సెమీ ఫైనల్లోకి ఎంటరైన టీమ్స్ కి 6.29 కోట్ల రూపాయలు ఇవ్వనుండగా, గ్రూపు మ్యాచ్ ఆడిన ప్రతి జట్టుకి రూ. 29 లక్షలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిచింది ఐసీసీ. ప్రతి టీమ్ కు కనీసం రెండు కోట్లు దక్కే అవకాశాలు ఉన్నట్లు ఐసీసీ తన ప్రకటనలో వెల్లడించింది. జూన్ 12వ తేదీన బర్మింగ్‌హామ్‌లో శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి మ్యాచ్ జరగనునంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భారత్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్థాన్ , స్కాట్‌ల్యాండ్, దక్షిణాప్రికా, వెస్ట్ ఇండీస్ కూడా ఈ మెగా టోర్నీలో ఉన్నాయి. 24 రోజుల్లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి.
𝘽𝙞𝙜𝙜𝙚𝙧 𝙩𝙝𝙖𝙣 𝙚𝙫𝙚𝙧 🤩
Record prize money revealed for ICC Women’s #T20WorldCup 2026 👏https://t.co/g74ifqwa21
— ICC (@ICC) April 13, 2026