Reading Time: 2 minutes
చెల్లగా నటించిన అమ్మయినే పెళ్లి చేసుకున్న నటుడు.. తెలుగులో తోప్ అతను

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఒకే హీరోతో రకరకాల పాత్రలు చేస్తుంటారు. ఒకే హీరోకు లవర్ గా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇలా రకరకాల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే కొంతమంది సెలబ్రెటీలు తమ కో స్టార్స్ ను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాగే హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం చాలా కామన్. అయితే కొంతమంది సెలబ్రెటీలు అభిమానులను పెళ్లి చేసుకుంటుంటారు. అయితే ఓ నటుడు తనతో చెల్లి పాత్రలో నటించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అతను చాలా ఫేమస్ నటుడు.. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఆయన. ఇంతకూ ఆయన ఎవరంటే..

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

సహాయక పాత్రల్లో మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు నటుడు జయరాం. తమిళ్ లో స్టార్ నటుడిగా రాణించిన జయరాం.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. తెలుగులో బడా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు జయరాం. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో.., హాయ్ నాన్న, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే ఆయన ఓ నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ నటుడి భార్య తమిళ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఆకట్టుకుంది ఆవిడ.

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

ఆమె పేరు పార్వతి.. తమిళ్ లో 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు ఆమె.. 1988లో వచ్చిన పద్మరాజన్ సినిమాలో జయరామ్, పార్వతి తొలిసారి కలిసి నటించారు. అయితే.. ఈ సినిమాలో జయరాం, పార్వతి అన్న, చెల్లెళ్లుగా నటించారు. అదే ఏడాది విట్నెస్ అనే మూవీ రిలీజైంది. ఈ మూవీలో జయరామ్ ప్రేయసిగా పార్వతి నటించింది. అదే టైం లో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. జయరాం పార్వతికి ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పిందంట. దాదాపు 5ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట 1992లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి దాదాపు 12 సినిమాల్లో నటించారు.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

Jayaram

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.