Reading Time: 2 minutes
Infinix Note 60 Pro Launched In India With 144hz Amoled 6500mah Battery And Price And Specs Are

Infinix Note 60 Pro Launched: భారతదేశంలో కొత్తగా ఇన్ఫినిక్స్ (Infinix) నుండి నోట్ 60 ప్రో (NOTE 60 Pro) మోడల్‌ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచేలా ఫీచర్స్ ను అందిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్, స్లిమ్ బార్డర్లు, కర్వ్డ్ ఎడ్జ్‌లతో స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది. సైడ్‌లో ఉన్న One-Tap బటన్ ద్వారా హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, HRV వంటి హెల్త్ మెట్రిక్స్‌ను ట్రాక్ చేయవచ్చు.

CM Chandrababu: పరిశ్రమల పర్మిషన్లలో సరళీకరణ.. ఆన్‌లైన్ విధానంపై సీఎం గ్రీన్ సిగ్నల్..!

వీటితోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, IP64 రేటింగ్‌తో ధూళి, నీటి చిమ్మరింపుల నుంచి రక్షణ లభిస్తుంది. JBL ట్యూనింగ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ఫోన్ వెనుక భాగంలో ఉన్న యాక్టీవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది అవసరమైనప్పుడు మాత్రమే వెలిగుతూ నోటిఫికేషన్లు, యానిమేషన్లు, మినీ గేమ్స్ చూపిస్తుంది.

Infniix Note 60 Pro Camera

ఈ కొత్త నోట్ 60 ప్రో లో 6.78 అంగుళాల 1.5K రిజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ అనుభవం లభిస్తుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, అల్ట్రా-న్యారో బెజెల్స్‌తో విజువల్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది. ఇక ఫోన్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 3D VC కూలింగ్ సిస్టమ్, 360° గేమింగ్ యాంటెన్నా ద్వారా హీట్ కంట్రోల్, సిగ్నల్ స్టెబిలిటీ మెరుగుపడుతుంది. Call of Duty Mobile వంటి గేమ్స్‌లో 120fps సపోర్ట్ కూడా లభిస్తుంది.

ఇందులో 6500mAh భారీ బ్యాటరీ ప్రధాన హైలైట్. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 30W వైర్లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. “సెల్ఫ్-రిపేరింగ్” టెక్నాలజీతో బ్యాటరీ దీర్ఘకాలం ఆరోగ్యాన్ని నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఇక ఫోటోగ్రఫీ కోసం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Ultra HDR టెక్నాలజీతో సహజమైన ఫోటోలు తీసుకోవచ్చు. 4K వీడియో రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Android 16 ఆధారిత XOS 16పై పనిచేస్తుంది. FOLAX AI అసిస్టెంట్ ద్వారా స్క్రీన్ అనాలిసిస్, ట్రాన్స్‌లేషన్, సమ్మరైజేషన్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. 3 ఆండ్రాయిడ్ అప్డేట్లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

Infniix Note 60 Pro Features

Redmi A7 Pro 5G: 32MP AI కెమెరా + 6,300 mAh బ్యాటరీ, 6.9-అంగుళాల డిస్‌ప్లేతో.. రెడ్‌మీ A7 ప్రో 5G విడుదల

ఈ మొబైల్ సోలార్ ఆరంజ్, మొఛా బ్రౌన్, డీప్ ఓషన్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ధర రూ. 31,999 (8GB+128GB) నుండి ప్రారంభమవుతుంది. 8GB+256GB వేరియంట్ ధర రూ. 34,999గా ఉంది. ఫ్లిప్కార్ట్, ఇన్ఫినిక్స్ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ కార్డులపై రూ. 3000 తగ్గింపు, ఎక్స్చేంజ్‌పై అదనంగా రూ. 2000 డిస్కౌంట్, రూ. 3999 విలువైన MagPower స్పీకర్ ఉచితం, ఒక సంవత్సరం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.