
ఐపీఎల్ 19లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 217 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఆర్ఆర్ తొలి నాలుగు ఓవర్లలోనే ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. సన్ రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ టాపార్డర్‌ను చావుదెబ్బ తీశాడు.
ఈ సీజన్లో సూపర్ ఫామ్‌లో ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జూరెల్, ప్రిటోరియస్ ముగ్గురిని ఫస్ట్ ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. ఆర్సీబీపై మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ ఇద్దరు ఈ మ్యాచులో డకౌట్ కావడం గమనార్హం. రెండో ఓవర్ వేసిన సాకీబ్ హుస్సేన్ భీకర ఫామ్‌లో ఉన్న ఆర్ఆర్ ఓపెనర్ జైశ్వాల్‌ను ఔట్ చేశాడు.
మళ్లీ నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ప్రఫుల్ ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో రాజస్థాన్ కేవలం 3.4 ఓవర్లలోనే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. రాజస్థాన్ 4 నాలుగు ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జడేజా (11), ఫెర్రిర్రా (1) ఉన్నారు. కాగా, ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషాన్ (91) దుమ్మురేపాడు.