Reading Time: < 1 minute
Actress Trisha Receives Bomb Threat At Chennai Home Police Confirm It As Hoax

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రముఖ హీరోయిన్ త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు వచ్చింది. టైనంపేట్‌లోని త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లుగా డీజీపీ కార్యాలయానికి ఈ మెయిల్ బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే టైనంపేట్‌ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా త్రిష ఇంట్లో పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ సోదాలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్ బృందం జాగిలాలతో తనిఖీలు చేయగా.. త్రిష ఇంట్లో ఎలాంటి బాంబు ఆనవాళ్లు కనిపించలేదని తేల్చారు. బాంబు బెదిరింపు బూటకమని తేల్చారు.

Trisha2

ఈ మెయిల్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి బాంబ్ బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. అయితే దుండగుడు ఎవరనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్‌లో లభించిన ఐడీ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు కూపీ లాగుతున్నారు. నిందితుడు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం త్రిష-హీరో విజయ్ కలిసి ఉంటున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఒకే కారులో పెళ్లికి కూడా హాజరయ్యారు. దీంతో వదంతులకు బలం చేకూరింది. ఇక ప్రస్తుతం విజయ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. విజయ్ కొత్తగా టీవీకే పార్టీని స్థాపించారు. అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా పని చేస్తున్నారు. ఏ మేరకు తమిళనాడు ప్రజలు ఆదరిస్తారు? అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Pope Leo-Trump: ట్రంప్ అంటే భయం లేదు.. యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా.. పోప్ లియో ప్రకటన