Reading Time: < 1 minute
Balakrishna Risky Lineup After Akhanda 2 Failure Vijay Kanakamedala Vivek Athreya

నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక వైబ్రేషన్. ఆయన సినిమా అనౌన్స్ అయిందంటే చాలు రికార్డులు తిరగరాయాల్సిందే. అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బాలయ్య తన తదుపరి సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. స్టార్ డైరెక్టర్ల వెంట పడకుండా, అస్సలు సక్సెస్ ట్రాక్ లేని దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా ఒక ప్లాప్ రాగానే టాప్ డైరెక్టర్ల కోసం వెతుకుతారు. కానీ బాలయ్య మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్తున్నారు. ఒక్కటంటే ఒక్క భారీ హిట్ కూడా లేని డైరెక్టర్లకు ఆయన అవకాశాలు ఇస్తుండటం చర్చనీయాంశమైంది.

Also Read :Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి

ముఖ్యంగా విజయ్ కనకమేడల పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన డెబ్యూ మూవీ ‘నాంది’ విమర్శకుల ప్రశంసలు పొంది బ్రేక్ ఈవెన్ సాధించినప్పటికీ, ఆ తర్వాత తీసిన ‘ఉగ్రం’, ‘భైరవం’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇలాంటి టైమ్‌లో ఆయన చెప్పిన ఒక పోలీస్ స్టోరీకి బాలయ్య ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్పేశారని సమాచారం. మరోవైపు క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా ఉంటుందనే వార్త ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వివేక్ ఆత్రేయ, మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యను ఎలా హ్యాండిల్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఇప్పటివరకు స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా తీయని వివేక్, బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే కథను రెడీ చేశారా? లేక ఇది మరో ప్రయోగం కానుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సాధారణంగా బాలయ్యకు కథ నచ్చితే చాలు, డైరెక్టర్ ట్రాక్ రికార్డుతో పనిలేకుండా సినిమా పట్టాలెక్కిస్తారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లు పట్టాలెక్కితే, అది బాలయ్య కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేక ప్లాపుల డైరెక్టర్ల ఖాతాలో మరో సినిమా చేరుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.