Reading Time: < 1 minute

సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో టిజిఎస్‌డబ్లుర్‌జెసి సెట్ -2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి తెలిపారు. 2026- 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభ కేంద్రాలు (సిఓఈ), రెగ్యులర్ జూనియర్ కాలేజీలు, సైనిక్ కాలేజీలు, ఒకేషనల్ కాలేజీలు, ఫైన్ ఆరట్స్ కాలేజీ (బాలికలు)లలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ ఈ నెల 25తో ముగుస్తుందని ఆయన తెలిపారు.

అర్హత కలిగి, ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు వ్రాసిన విద్యార్థులు నిర్ణయించిన గడువు తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రవేశ పరీక్ష మే 15న ఉదయం 10 గం.ల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ నందు పొందుపరచిన ప్రాస్పెక్టస్ ను చూడాలన్నారు. విద్యార్థులు దరఖాస్తులను అధికార వెబ్ సైట్లు http://rjcet.telangana.gov.in, ttp://TGSWREIS.telangana.gov.in ద్వారా సమర్పించవచ్చని సూచించారు.