
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రస్థానం రేపటితో ముగుస్తోంది. రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సేవలందించారు. అయితే అనూహ్యంగా గత నెలలో రాజ్యసభకు వెళ్లిపోయారు. ఈ నిర్ణయం యావత్తు దేశాన్ని షాకింగ్‌కు గురి చేసింది. ఇక ముఖ్యమంత్రి పదవికి 14-04-2026న (మంగళవారం) నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. అయితే ఈసారి ముఖ్యమంత్రి పదవి జేడీయూకు కాకుండా బీజేపీకి దక్కుతోంది. దీంతో నితీష్ కుమార్ వారసుడిగా బీజేపీ వ్యక్తి రాబోతున్నట్లుగా తేలిపోయింది.
ఇది కూడా చదవండి: Trump-China: ట్రంప్ సుంకాల బెదిరింపుపై స్పందించిన చైనా.. ఏమన్నాదంటే..!
మంగళవారం సాయంత్రం 4 గంటలకు పాట్నాలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసి ప్రకటించనుంది. అయితే నితీష్ కుమార్ వారసుడి ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరికి ఈ పదవికి దక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఆయన కాకపోతే కేంద్రమంత్రికి ఆ పదవి దక్కొచ్చని వినిపిస్తోంది. మొత్తానికి ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక ముఖ్యమంత్రి పేరు ప్రకటించగానే.. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రమణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
గతేడాది నవంబర్‌లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సునామీలా దూసుకెళ్లింది. దాదాపు 202 సీట్లు కైవసం చేసుకుంది. తిరిగి లేని శక్తిగా మారింది. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా చతికిలపడ్డాయి. తేజస్వి యాదవ్ ప్రతిపక్ష స్థానంలో కూర్చొన్నారు.
ఇది కూడా చదవండి: Amit shah: అధికారంలోకి రాగానే బెంగాల్ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటన