
అమరావతి: కడప జిల్లాలో మైదుకూరు మండలం వరదాయపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్ బీభత్సం చేసింది. సిమెంట్ ట్యాంకర్ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల బస్సును ఢీకొంది. పెట్రోల్ ట్యాంకర్ రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్నిఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. రహదారిపై ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.