Reading Time: < 1 minute
Amit Shah Promises Border Fencing In West Bengal If Bjp Wins Power

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి రాగానే రాష్ట్ర సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బర్ధమాన్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి అక్రమ వలసదారులను తొలగించగలిగేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర సరిహద్దు వెంబడి కంచె ఏర్పాటుకు బీఎస్ఎఫ్‌కు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: పరిశ్రమల పర్మిషన్లలో సరళీకరణ.. ఆన్‌లైన్ విధానంపై సీఎం గ్రీన్ సిగ్నల్..!

బెంగాల్‌లో మైనార్టీ వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మమత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగాల్ ప్రజలు బాంబులకు ఓట్లతో సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. రాష్ట్రం, దేశం నుంచి చొరబాటుదారులను తరమికొట్టేందుకు ఈ ఎన్నికలే ప్రధానం అన్నారు. ఎన్నికల నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు ఈసీ తగినంత బలగాలను రాష్ట్రానికి పంపిందని తెలిపారు.