Reading Time: 2 minutes

IPL 2026: చెలరేగిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్.. రాజస్థాన్ని చిత్తు చేసిన సన్ రైజర్స్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)19వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)  అద్భుత విజయాన్ని అందుకుంది. 217 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఆర్ఆర్ 19 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ ఘోర ఓటమిని ముట్టగట్టుకుంది. ఇక ఈ సీజన్‎లో అద్భుతమైన ఫామ్‏లో ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జూరెల్, ప్రిటోరియస్, రియాన్ పరాగ్ లని మొదటి ఓవర్లోనే ప్రపుల్ డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన సాకిబ్ హుస్సేన్ భీకర ఫామ్‎లో ఉన్న ఆర్ఆర్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (1)‎ను ఔట్ చేశాడు.

ప్రఫుల్ హింగే విధ్వంసం: 
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు తొలి ఓవర్లోనే సన్‌రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే బిగ్ షాక్ ఇచ్చాడు. వేసిన 4 ఓవర్లోనే 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్ రియాన్ పరాగ్.. ఈ నాలుగురిని అవుట్ చేసి రాజస్థాన్ వెన్నులో వణుకు పుట్టించాడు. మరో బౌలర్ సాకిబ్ హుస్సేన్ సైతం డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్ ఈ నాలుగురి వికెట్లు పడగొట్టాడు. 

ఫెరీరా, జడేజా పోరాటం వృథా: 
ఘోర పరాజయం తప్పదనుకున్న స్థితిలో డొనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఫెరీరా అద్భుత హాఫ్ సెంచరీతో (44 బంతుల్లో 69 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. జడేజా (32 బంతుల్లో 45 పరుగులు) అతనికి మంచి సహకారం అందించాడు. అయితే వీరిద్దరినీ వరుసగా సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ అవుట్ చేయడంతో రాజస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. చివరిలో తుషార్ దేశ్‌పాండే పోరాడినప్పటికీ విజయం మాత్రం హైదరాబాద్‌నే వరించింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్‎ బౌలర్లలో ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ ఓటమిలో కీలక పాత్ర పోషించగా, ఎషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు.

©️ VIL Media Pvt Ltd.