Reading Time: < 1 minute

ఆర్‌జెడి చీప్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. భూములకు ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో తనపై, తన కుటుంబ సభ్యులపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు తోసిపుచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటేశ్వర సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసులో మెరిట్స్‌ను పరిశీలించే అధికారాన్ని ట్రయిల్ కోర్టుకే విడిచిపెడుతూ, చట్టప్రకారం విచారణ కొససాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

అయితే ట్రయల్ కోర్టు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి లాలూకు మినహాయింపు ఇచ్చింది. ఈకేసులో ఇంతకుముందు లాలూ ప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. సీబీఐ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని లాలూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపైనే సుప్రీం తాజా తీర్పు చెప్పింది.