Reading Time: < 1 minute

IPL 2026: ఆరంభం అదిరింది.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి బౌలర్‎గా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డ్

Caption of Image.

సన్‎రైజర్స్ హైదరాబాద్ అరంగ్రేట బౌలర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్‎లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‎లో ఒక ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‎గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 19లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 13) రాజస్థాన్ రాయల్స్‎తో జరిగిన మ్యాచులో తొలి ఓవర్లోనే వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్‎ను ఔట్ చేయడం ద్వారా ఈ రేర్ ఫీట్ నెలకొల్పాడు. ఓవరాల్‎గా ఈ మ్యాచులో నాలుగు వికెట్లు తీసిన ప్రఫుల్ ఐపీఎల్‎ ఆరంభాన్ని చిరస్మరణీయంగా చాటుకున్నాడు. 

సన్‎రైజర్స్ హైదరాబాద్ పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్ అరంగ్రేట మ్యాచులోనే అదరగొట్టాడు. తన తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‏ను కకావికలం చేశాడు. ఈ సీజన్‎లో సూపర్ ఫామ్‎లో ఉన్న రాజస్థాన్ స్టార్ బ్యాటర్స్ వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, ప్రిటోరియస్‎ను ఫస్ట్ ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే సూర్యవంశీని గోల్డెన్ డక్‌ ఔట్ చేశాడు. 

ఆఫ్ స్టంప్‌కు కొంచెం దూరంగా పడిన నాలుగో బంతిని ధ్రువ్ జురైల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్లను గిరాటేసింది. ఆరో బంతికి దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ప్రిటోరియస్‌ను డకౌట్‌ ఔట్ చేశాడు. ప్రిటోరియస్ ఫ్లిక్ షాట్ ఆడగా బంతి నేరుగా డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. దీంతో 217 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఆర్ఆర్ తొలి నాలుగు ఓవర్లలోనే ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. 
 

©️ VIL Media Pvt Ltd.