
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు ఎస్ఆర్‌హెచ్ జట్టును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన హైదరాబాద్ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ(0) తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ ఇషాన్ కిషన్.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 55 పరుగులు జోడించారు. అయితే రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (18) ఔట్ కావడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఇషాన్(48), క్లాసెన్(6) ఉన్నారు.