Reading Time: 2 minutes

SRH vs RR మధ్య ఆసక్తికర పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

Caption of Image.

SRH vs RR: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్)లో మరో ఉత్కంఠభరిత పోరుకు సిద్ధమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుతో, వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నేడు (2026, ఏప్రిల్ 13న) తలపడనుంది. ఈ సీజ‌న్‌లో ఇప్పటికీ వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన రాజ‌స్థాన్ ని ఓడించి సొంత గడ్డపై విజయం సాధించాలనే పట్టుదలతో స‌న్‌రైజ‌ర్స్ ఉంది.  

జట్ల బలాబలాలు
రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండ్ షో: 

ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజస్థాన్, అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇక బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జోడీ పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ మిడిల్ ఆర్డర్‌లో జట్టుకి వెన్నెముకగా నిలుస్తున్నారు. మరోవైపు బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వేగానికి తోడు.. రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాల స్పిన్ మాయాజాలం రాజస్థాన్‌ను తిరుగులేని జట్టుగా మార్చింది.

హైదరాబాద్ బౌలింగ్ కష్టాలు: 
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నప్పటికీ, నిలకడలేమి జట్టుని తీవ్రంగా వేధిస్తోంది. ఇక హైదరాబాద్ జట్టుకు ప్రధాన బలహీనత బౌలింగ్.. గత మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోవడం వారి వైఫల్యానికి అద్దం పడుతోంది. హోం గ్రౌండ్‌లోనైనా బౌలర్లు పుంజుకోవాలని హైదరాబాద్ అభిమానులు కోరుకుంటున్నారు.

హెడ్ టు హెట్ రికార్డులు: 
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లలలో తలపడ్డాయి.  సన్‌రైజర్స్ 12 మ్యాచులలో విజయం సాధించగా, రాజస్థాన్ కేవలం 9 మ్యాచులు మాత్రమే గెలిచింది. 

పిచ్ రిపోర్ట్: 
ఉప్పల్ పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు సహకరిస్తుంది. ఇరు జట్లలోనూ విధ్వంసకర ఆటగాళ్లు ఉండటంతో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.. వాతావరణం ప్రశాంతంగా, ఉష్ణోగ్రత సుమారు 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. 

తుది జట్ల అంచనా: 

సన్‌రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్/ కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షిల్ పటేల్, ఈషాన్ మలింగ.
(ఇంపాక్ట్ ప్లేయర్: లియామ్ లివింగ్‌స్టోన్)

రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్.
(ఇంపాక్ట్ ప్లేయర్: బ్రిజేష్ శర్మ)

©️ VIL Media Pvt Ltd.