Reading Time: < 1 minute

 కేంద్రం, బిజెపి పాలిత రాష్ట్రాలపై సిఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. తనను ఓడించడానికి 19 రాష్ట్రాలు, కేంద్రం కలిసి కట్టుగా వచ్చాయని, కానీ ఒంటిచేత్తో వారందరినీ ఎదుర్కొంటున్నాని అన్నారు. సోమవారంనాడిక్కడ ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లు సాధించబోతుందన్నారు. యువతను ప్రభావితం చేయడానికి ప్రధాని మోడీ మన్ కీ బాత్‌ను పదేపదే ప్రసారం చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులతో డబ్బు మూటలు ఇచ్చి రాష్ట్రంలో ఓటర్లకు పంచి మభ్యపెడుతున్నారని మమత ఆరోపించారు. బీహార్ నుంచి రైళ్లు, బస్సుల్లో ఓటర్లను తరలిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహా 19 రాష్ట్రాల బిజెపి నేతలు కలిసి వచ్చినా వారందరికి తాను ఒక్కదాన్నే సమాధానం చెప్పగలన్నారు. సామాన్య ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడుతానని మమత పేర్కొన్నారు.