Reading Time: < 1 minute

గచ్చిబౌలిలో గంజాయి కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

Caption of Image.

హైదరాబాద్ ఐటీ హబ్‌లో గంజాయి కలకలం.  గచ్చిబౌలి పరిధిలోని నానక్‌రామ్‌గూడలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే ముసుగుగా.. క్యాబ్ డ్రైవర్‌తో కలిసి సాగిస్తున్న ఈ దందాను శేరిలింగంపల్లి ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు.

ఈ కేసులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రేమానంద్ మల్లిక్‌తో పాటు క్యాబ్ డ్రైవర్ విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మూడు ప్యాకెట్లలో నింపిన సుమారు 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి నుంచి ఈ గంజాయిని సేకరించి.. నగరంలోని యువతకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన రాఘవేంద్ర , ఆకాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.