Reading Time: < 1 minute

ఒటిటిలు అంటేనే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సినిమాలతో పాటు.. రకరకాల వెబ్ సిరీస్‌లు కూడా. అందులోనే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు మంచి ప్రేక్షకాదరణ ఉంటుంది. అలాంటి వెబ్ సిరీసే.. ‘పోచమ్మ’. బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటుడు అర్జున్ అంబాటి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ త్వరలో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఈ సిరీస్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఓ గ్రామంలోనే భవంతి అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరి ప్రజలపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్‌డ్రాప్‌లో ఈ సిరీస్‌ని తీసినట్లు తెలుస్తోంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.