Reading Time: 2 minutes

ఇంత కరువులో ఉన్నావేంటి సామీ..! రూ.9,400 కోట్ల డబ్బు, అందమైన అమ్మాయి కావాలని టర్కీకి ఉగాండా ఆర్మీ చీఫ్ డిమాండ్

Caption of Image.

ఒక బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.9,400 కోట్లు), దేశంలోనే అత్యంత అందమైన అమ్మాయి కావాలి.. అది కూడా 30 రోజుల్లో. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.. టర్కీ దేశానికి ఓ వ్యక్తి ఇచ్చిన వార్నింగ్ ఇది. ఆ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి సైబర్ నేరగాడు కాదు. టెర్రరిస్ట్ అంతకన్నా కాదు.. ఈ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి స్వయంగా ఒక దేశ ఆర్మీకి చీఫ్.. అదే సైన్యాధిపతి. గౌరవప్రదమైన ఆర్మీ చీఫ్ పదవిలో ఉండి అందమైన అమ్మాయి కావాలంటూ ఇలా బహిరంగంగా కామ కోరికలు కోరడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. మరీ ఆ కామ కోరికలు కోరిన వ్యక్తి ఎవరు..? ఏ దేశానికి వార్నింగ్ ఇచ్చారు..? ఏ దేశానికి చెందిన అందమైన అమ్మాయి కావాలని కోరాడో పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ఉగాండా సైన్యాధిపతి, జనరల్ ముహూజీ కైనెరుగాబా టర్కీ ముందు రెండు అసాధారణమైన డిమాండ్లను ఉంచారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులకు వ్యతిరేకంగా ఉగాండా సైన్యం దీర్ఘకాలంగా పోరాడుతున్నందుకు టర్కీ తమకు ఒక బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.9,400 కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు టర్కీలోనే అత్యంత అందమైన అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయాలనేది ఆయన రెండో డిమాండ్. 

30 రోజుల్లోగా తన డిమాండ్లను నెరవేర్చడంలో విఫలమైతే తీవ్రమైన దౌత్యపరమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని టర్కీని హెచ్చరించారు. ఉగాండా రాజధాని కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేయడం, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌ను ఉగాండా గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి చేస్తామని బెదిరించారు. తమ డిమాండ్లు నేరవేర్చకపోతే టర్కీతో సంబంధాలు తెంచుకోవడానికి ఉగాండా ఏ మాత్రం వెనకాడబోదని వార్నింగ్ ఇచ్చారు. 

రెండో కండీషన్‎పై తీవ్ర విమర్శలు

టర్కీ ఒక బిలియన్ డాలర్లు చెల్లించాలన్న జనరల్ ముహూజీ కైనెరుగాబా మొదటి షరతు బానే ఉన్నా.. టర్కీలోనే అత్యంత అందమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలన్న రెండో డిమాండ్‎పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫెమినిస్టులు ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. గౌరవప్రదమైన ఆర్మీ చీఫ్ పోస్ట్‎లో ఉండి ఇలాంటి నీచ కామ కక్కుర్తి కోరికలు ఏంటని ఏకీపారేస్తున్నారు. అయితే, జనరల్ ముహూజీ కైనెరుగాబా స్త్రీద్వేషపూరిత వ్యాఖ్యల చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి అంతర్జాతీయ సమాజంతో చివాట్లు తిన్న అనుభవం ఆయనకు ఉంది.
 
2022లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని వివాహం చేసుకుంటానని.. బదులుగా ఇటలీకి 100 ఆవులను ఇస్తానని ప్రతిపాదన పెట్టాడు. అప్పట్లో కైనెరుగాబా కామెంట్స్‎పై తీవ్ర దుమారం చెలరేగింది. ఏకంగా దేశ మహిళా ప్రధానిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శల పాలయ్యాడు కైనెరుగాబా. ఇప్పుడేమో మొత్తం టర్కీ దేశంలోని అత్యంత అందమైన అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని కోరి తనలోని రసికున్ని మరోసారి బయటపెట్టాడు. 
 

©️ VIL Media Pvt Ltd.