Reading Time: < 1 minute

టిజి టెట్ జూన్ 2026 పరీక్ష (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్ విడుదలైంది. 2026 జూన్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. 15 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టిజి టెట్ చైర్మన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా, 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జూన్ 9 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేసి, జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జులై 28 నుంచి 31 మధ్య ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.

టెట్ జూన్ 2026 ముఖ్యమైన తేదీలు

ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం

ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

జూన్ 9 నుంచి టెట్ హాల్‌టికెట్లు జారీ

జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష నిర్వహణ

జులై 28 నుంచి 31 మధ్య టెట్ ఫలితాలు విడుదల