Reading Time: 2 minutes
138 Degrees In One Lifetime Inspiring Tale Of Dasarath Singh

చదువుకునేందుకు వయసు అడ్డంకి కాదని ఇదివరకు చాలా మంది నిరూపించారు. చదువుపై ఉన్న మక్కువతో లేటు వయసులో కూడా చదువుకుని డిగ్రీ పట్టాలు అందుకుని యువతకు ఆదర్శంగా నిలిచారు. నేటి కాలంలో కొందరు యువతీ యువకులు ఒక్క డిగ్రీ పాసవ్వడానికే ఆపసోపాలు పడుతున్న టైమ్ లో ఓ మాజీ సైనికుడు ఏకంగా 138 డిగ్రీలు, డిప్లొమాలు అందుకుని యువతకు సెగ తగిలేలా చేశారు.

Also Read:South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన బాక్సాఫీస్ లెక్కలు

రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన మాజీ సైనికుడు దశరథ్ సింగ్, తన విశిష్టమైన ఘనతతో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. దశరథ్ సింగ్ మొత్తం 138 డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్లు సంపాదించారు. ఇటీవల ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) స్నాతకోత్సవంలో ఆయనకు వేద అధ్యయనాలలో డిస్టింక్షన్‌తో మాస్టర్స్ డిగ్రీని ప్రదానం చేశారు. డిగ్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా దశరథ్ సింగ్ యూత్ కి రోల్ మోడల్ అయ్యారు.

55 ఏళ్ల దశరథ్ సింగ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో సహా విద్యారంగంలో 11 ప్రపంచ రికార్డులను నెలకొల్పినట్లు పేర్కొన్నారు. దశరథ్ సింగ్ ఝున్‌ఝును జిల్లాలోని నవల్‌గఢ్ తహసీల్ పరిధిలో ఉన్న ఖిరోడ్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబానికి విద్యా నేపథ్యం లేనప్పటికీ, అతను ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తదుపరి చదువు కష్టమైంది, కానీ అతను వదులుకోలేదు.

సైన్యంలో ఉంటూనే తన చదువును కొనసాగించాడు

1988లో, దశరథ్ సింగ్ భారత సైన్యంలో చేరి, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌తో సహా వివిధ ప్రాంతాలలో 16 సంవత్సరాలు పనిచేశారు. సైన్యంలో ఉన్నప్పుడు కూడా చదువును కొనసాగించారు. ప్రతి సంవత్సరం తనకు లభించే రెండు నెలల సెలవులను చదువు కోసం ఉపయోగించుకున్నారు.

పదవీ విరమణ తర్వాత

2004లో పదవీ విరమణ చేసిన తర్వాత, ఆయన పూర్తిగా విద్యపై దృష్టి సారించారు. సాధారణ విద్యార్థిగా ఉంటూనే, బి.కామ్, ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం, బి.జె.ఎం.సి, బి.ఎడ్ వంటి డిగ్రీలను పొందారు. ఐ.జి.ఎన్.ఓ.యు, జైన్ విశ్వ భారతి ఇన్‌స్టిట్యూట్, ఇతర విశ్వవిద్యాలయాల నుండి కూడా పలు కోర్సులను పూర్తి చేశారు. దశరథ్ సింగ్ ఇప్పటి వరకు సాధించిన వాటిలో 3 పీహెచ్‌డీలు, 7 గ్రాడ్యుయేషన్ డిగ్రీలు, 46 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు, 23 డిప్లొమాలు, 7 మిలిటరీ స్టడీస్ డిగ్రీలు, 52 సర్టిఫికేట్లు ఉన్నాయి.

Also Read:Charlapalli Su*ici*de case: చర్లపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. ప్రాణహాని ఉందంటూ పీఎస్‌కు విజయారెడ్డి భర్త..

సైనికుల కోసం పనిచేయడం

పదవీ విరమణ తర్వాత, చదువును కొనసాగించడమే కాకుండా సామాజిక సేవలో కూడా నిమగ్నమయ్యారు. తన న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి, సైనికుల కేసులలో సహాయం చేస్తూ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సప్త శక్తి కమాండ్‌లో న్యాయ సలహాదారుడిగా కూడా పనిచేశారు, అక్కడ సేవలందిస్తున్న, పదవీ విరమణ చేసిన సైనికుల కేసులను చూసుకున్నారు.