
ఆస్ట్రేలియా చరిత్రలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళను ఆర్మీ చీఫ్ గా నియమించింది. దేశ రక్షణ దళాల నాయకత్వంలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా, చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ తమ సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం (ఏప్రిల్ 13) ప్రకటించింది.
ప్రస్తుత జాయింట్ క్యాపబిలిటీస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయిల్ జూలైలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. ఆమె లెఫ్టినెంట్ జనరల్ సైమన్ స్టువర్ట్ స్థానంలో సైన్యాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, కోయల్.. ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ లో పలు ఆపరేషన్లు, ఉన్నతస్థాయి పదవులు నిర్వహించారు.