Reading Time: < 1 minute

ఏడేండ్ల తరువాత ఇరాన్ ముడిచమురు సరుకు భారత్ తీర ప్రాంతానికి చేరింది. ఇరాన్ క్రూడాయిల్‌తో అతి భారీ వాహక నౌక ఫెలిసిటి ఆదివారం గుజరాత్ తీరంలోని సిక్కాకు చేరుకుంది. రెండు మిలియన్ క్రూడాయిల్ బ్యారెల్స్‌తో ఫిబ్రవరి చివరిలో ఇరాన్ ఖర్గ్ దీవి నుంచి ఈ నౌక బయలుదేరి, ఇప్పుడు క్షేమంగా ఇక్కడికి చేరింది. ఇక మరో చమురు నౌక జయ ఒడిషా తీరంలోని పరదీప్ వద్దకు చేరుకుంది. ఇందులో కూడా 2 మిలియన్ బ్యారెల్స్ సరుకు ఉంది. ఈ క్రూడాయిల్ సరఫరాకు దాదాపు ఏడేండ్ల క్రితం ఇరుదేశాల చమురు కంపెనీల మధ్య కాంట్రాక్టు కుదిరింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షల దశలో చాలా కాలంగా సరఫరా నిలిచిపోయింది. ఇటీవలి కాలంలో ఇరాన్ చమురు తెప్పించుకునేందుకు వీలుగా అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది. ఈ దశలో క్రూడాయిల్ రవాణాకు వీలేర్పడింది.