Reading Time: < 1 minute

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, టివికె పార్టీ అధినేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రంలోని కొంత భాగం ఆన్‌లైన్‌లో లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తమిళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపింది. అయితే సినిమా ఎడిటర్ ప్రదీప్ ఇ.రాఘవ్ ఈ లీక్స్‌కి కారణం అంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఎడిటర్స్ యూనియన్ ఖండించింది. ఈ ఘటనతో ప్రదీప్‌కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘‘గ్రాఫిక్స్, సౌండ్ మిక్సింగ్‌ను మరింత మెరుగు పరిచేందుకు దర్శకుడు, నిర్మాతల అనుమతితోనే సినిమా కాపీని జనవరిలోనే ఓ స్టూడియోకి ప్రదీప్ పంపారు. ఒకవేళ ఆయన లీక్ చేయాలనుకుంటే ఎలాంటి వాటర్ మార్క్ లేకుండానే చేసేవారు కదా.?’’ అని పేర్కొంది. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసింది.