
సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్, పెట్టుబడి మోసం ఆరోపణలను ఖండిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాటలు పాడటమే తప్ప మోసాలు చేయడం తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. అడ్వకేట్ సుబ్బారావు తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారని మంగ్లీ మండిపడ్డారు. ఓ షోలో అవకాశం కోసం, లేదా పాపులారిటీ కోసం సుబ్బారావు తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మోసాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని మంగ్లీ ప్రకటించారు. అలాగే, మైక్రో ఫైనాన్స్ బాధితుల పక్షాన పోరాడటానికి కూడా సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna Sagar: డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్
అమెరికా బెదిరింపులు ఇరాన్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపవు
Warangal: నిప్పుల కుంపటిలా మారిన వరంగల్
Medicos Reels: వైద్యానికి రీల్స్ వైరస్ పట్టిందా..?
Iran vs USA Conflict: యుద్ధం ఇలాగే కొనసాగితే భారత్ చమురు అవసరాల పై భారం