
సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సిఎంగా ఎదిగారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఇప్పుడు అదే రీతిలో తమళినాడు ఎన్నికలల్లో పోటీ పడుతున్నారు అక్కడి స్టార్ హీరో విజయ్. తమిళగ వెట్రి కజగం(టివికె) పార్టీ పెట్టిన ఆయన ఈ అసెంబ్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ‘‘విజయ్‌కి మీరేమైనా సలహా ఇస్తారా?’’ అనే ప్రశ్నకు పవర్‌స్టార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తాను ఎవరికీ సలహాలు ఇవ్వను అని.. తన పిల్లల విషయంలోనూ అంతే అని పవన్ స్పష్టం చేశారు.
విజయ్ విషయానికొస్తే.. ఆయన చాలా సమర్థుడని.. చాలా పెద్ద స్టార్ అని కొనియాడారు. ‘జనసేనాని విత్ జెన్‌జీ’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో యువత అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇచ్చారు. ‘ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయి ఉంటే.. ఏ కంటెంట్‌పై వీడియోలు చేస్తారు?’ అని అడగ్గా.. దేశభక్తి, ప్రకృతి పరిరక్షణపై చేస్తానని తెలిపారు. ఇంకా రాజకీయాలు, సోషల్‌మీడియా గురించి కూడా పవన్ తనదైన శైలీలో సమాధానాలు ఇచ్చారు.