Reading Time: < 1 minute
Deepika Pilli Clarifies Fake Ai Photo With Sudigali Sudheer Instagram Hacked

బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ చుట్టూ ఏదో ఒక వార్త ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా సుధీర్, దీపికా పిల్లి కలిసి నెదర్లాండ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారంటూ ఒక ఫోటో బయటకు రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ వ్యవహారంపై దీపికా పిల్లి స్పందించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. సుధీర్, యాంకర్ దీపికా పిల్లి నెదర్లాండ్స్‌లో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారంటూ గత రాత్రి సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయ్యింది. దీపికా పిల్లి అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనే ఈ ఫోటో కనిపించడంతో.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అభిమానులు రకరకాల కామెంట్లతో హోరెత్తించారు. కానీ, తెల్లారేసరికి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

Also Read:Balakrishna : అఖండ-2 రిజల్ట్‌తో రిస్క్ చేస్తున్న బాలయ్య!

దీపికా పిల్లి ఒక ఎమోషనల్ అండ్ సీరియస్ పోస్ట్‌ను షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందని ఆమె అధికారికంగా ప్రకటించింది. “నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. నిన్న రాత్రి నా స్టోరీలో షేర్ చేసిన ఫోటో పూర్తిగా AI-Generated. అది పక్కా ఫేక్ పిక్. నా అనుమతి లేకుండా, నా ప్రమేయం లేకుండా ఆ ఫోటోను పోస్ట్ చేశారు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆమె స్పష్టం చేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని దీపికా తన ఫాలోవర్లను కోరింది. “దయచేసి ఆ ఫోటోను ఎక్కడా సర్క్యులేట్ చేయకండి. అలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దు. ప్రస్తుతం నా అకౌంట్‌ను రిట్రీవ్ చేసే పనిలో ఉన్నాను. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు” అంటూ ఒక నోట్‌ విడుదల చేసింది. మొత్తానికి, సుధీర్ – దీపికా వెకేషన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా హ్యాకర్ల పని అని తేలిపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నా, ఈ హ్యాకింగ్‌పై దీపికా పోలీసులకు ఫిర్యాదు చేస్తుందో లేదో వేచి చూడాలి.