
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయం మరింత వేడెక్కింది. అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకెళ్తున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్, ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అధినేత దళపతి విజయ్ తన ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. అయితే లేటెస్ట్ గా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఒక ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం చోటుచేసుకుంది. కన్యాకుమారిలో విజయ్ చేపట్టిన సైకిల్ ర్యాలీ సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పూల బంతి.. బాంబు భయం?
ఏప్రిల్ 12న కన్యాకుమారి వీధుల్లో వేలాది మంది అభిమానుల మధ్య విజయ్ సైకిల్‌పై వెళ్తుండగా ఒక ఊహించని సంఘటన జరిగింది. జనసమూహం నుంచి ఒక అభిమాని విజయ్ వైపు ఒక వస్తువును విసిరాడు. అది చూసిన వెంటనే విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, సైకిల్ దిగి భద్రతా సిబ్బంది వైపు పరిగెత్తారు. సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా అప్రమత్తమై ఆయన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. వెంటనే వ్యాన్ లో ఎక్కించారు.
నిజానికి ఆ వస్తువు పేలుడు పదార్థం కాదు, అది పూలతో నిండిన ఒక చిన్న బంతి. అది కింద పడగానే పగిలి పూలు వెదజల్లింది. అయితే, ఆ సమయంలో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా విజయ్ అది ‘బాంబు’ ఏమోనని భావించి భయపడ్డారని నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. విజయ్ బాంబు అనుకుని పరుగులు తీశారు అంటూ వీడియోలు వైరల్ అవుతుండగా, అభిమానులు మాత్రం అది కేవలం ప్రాథమిక భద్రతా చర్య అని కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక పోలీసు అధికారి తొక్కిసలాటలో కింద పడటం కూడా కెమెరాకు చిక్కింది.
పెరంబూర్, తిరుచ్చి టార్గెట్!
ఈ చిన్నపాటి అపశ్రుతి పక్కన పెడితే, ఎన్నికల ప్రచారంలో విజయ్ తనదైన శైలిలో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యంగా పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో తన పట్టు నిరూపించుకోవాలని ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సామాన్యుడిలా సైకిల్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ సైకిల్ యాత్రలు ఆయన సినిమా ఇమేజ్‌ను పక్కన పెట్టి, ప్రజల మనిషిగా చూపించేందుకు దోహదపడుతున్నాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ సరికొత్త హామీలు
ఈ ర్యాలీలో విజయ్ తన రాజకీయ ప్రత్యర్థి, అధికార DMKపై నిప్పులు చెరిగారు. ఈ యుద్ధం కేవలం టీవీకే (TVK), డీఎంకే (DMK) మధ్యే. ప్రజల పక్షాన నిలిచే నాయకుడు కావాలా లేక ప్రజా వ్యతిరేక పాలన కావాలా? అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తన మేనిఫెస్టోలో వినూత్న అంశాలను విజయ్ ప్రకటించారు. ప్రభుత్వ సేవలను ప్రజల వేలిముద్రపైకి తీసుకురావడం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం. అవినీతిని అంతం చేసేందుకు ప్రత్యేకంగా సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్ ను తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
ఈ ‘సైకిల్ ర్యాలీ’ వైరల్ ఘటన ఆయనకు నెగటివ్ పబ్లిసిటీ తెచ్చిపెట్టినా, అంతిమంగా అది ఆయన ప్రచారానికి భారీ మైలేజీని ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో ఈ ‘దళపతి’ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి
వడ్డీల రూపంలో చెల్లిస్తున్న ప్రతి రూపాయి, మన పిల్లల చదువుకు, వైద్యానికి అందాల్సిన సంపద అంటూ ఆర్థిక క్రమశిక్షణపై విజయ్ సీరియస్ అయ్యారు. ఈ ‘సైకిల్ ర్యాలీ’ వైరల్ ఘటన ఆయనకు నెగటివ్ పబ్లిసిటీ తెచ్చిపెట్టినా, అంతిమంగా అది ఆయన ప్రచారానికి భారీ మైలేజీని ఇస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో ఈ ‘దళపతి’ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.
Yeh hai film ke hero! On screen, he beats 10 Goons at a time. In real life….ZERO!
One fan threw flowers at him & ‘Superstar’ (😂) Vijay ki joh fatt gayi…
Hilarious.😂Now this video is going so viral, it’s going to hurt his ‘dare devil’ image big.pic.twitter.com/6j83z4yQPA
— BhikuMhatre (@MumbaichaDon) April 13, 2026