
ప్రముఖ గాయని ఆశా భోస్లే ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె మరణంతో అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె పాటలను గుర్తుచేసుకుంటూ దు:ఖసాగరంలో మునిగిపోయారు. ఇక సోమవారం ముంబైలో అంత్యక్రియలు ముగిశాయి. పెద్ద ఎత్తున అభిమానులు హాజరై నివాళులర్పించారు.
ఇదిలా ఉంటే ఆశా భోస్లే భౌతిక కాయాన్ని సినీ, రాజకీయ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అయితే ఆశా భోస్లే భౌతిక కాయాన్ని క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేను సిరాజ్ ప్రత్యేకంగా ఓదార్చారు. దు:ఖంలో ఉన్న జనై భోస్లేను ఏడ్వొద్దు అంటూ సముదాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మహమ్మద్ సిరాజ్-జనై భోస్లే మధ్య మంచి స్నేహ బంధం ఉంది. గత సంవత్సరం సిరాజ్ చేతికి జనై రాఖీ కూడా కట్టింది.
ఆశా భోస్లే..
ఆశా భోస్లే 12,000కు పైగా పాటలు పాడారు. 20 భాషల్లో గానం చేయడం వంటి రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె స్థానం సంపాదించారు. మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాలతో ఆశాభోస్లే కలిసి పనిచేశారు. ఆర్‌డీ బర్మన్, ఎస్‌డీ బర్మన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌కి ఆమె పాటలు పాడారు. అనేక హిట్స్ అందించారు.
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కెరీర్ ప్రారంభించి ఆశాభోస్లే కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేవలం 10 ఏళ్ల వయసులో 1943లో ఆమె కెరీర్ ప్రారంభించారు. తన అక్కలాగే పాటలు పాడటం స్టార్ట్ చేశారు. తన కుటుంబాన్ని పోషించడం కోసం అక్క లతా మంగేష్కర్ తో కలిసి పాటలు పాడారు. మైక్రోఫోన్ అంటే ఏమిటో తెలియని సమయంలోనే 1943లో ఒక మరాఠీ సినిమాలో పాట పాడారు. 1948లో ‘‘చునారియా’’ సినిమాతో ఆశాభోస్లే బాలీవుడ్ అరంగ్రేటం చేశారు.
#WATCH | Mumbai, Maharashtra: Mortal remains of legendary singer Asha Bhosle being taken for last rites at the Shivaji Park Crematorium pic.twitter.com/0LBP6LxauE
— ANI (@ANI) April 13, 2026
#WATCH | Mumbai, Maharashtra: Mortal remains of legendary singer Asha Bhosle being taken for last rites at the Shivaji Park Crematorium pic.twitter.com/J1Yhys9DHU
— ANI (@ANI) April 13, 2026