Reading Time: 2 minutes
Jr NTR: ధురంధర్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. 6 నెలల్లో రెండు భాగాలు

జూనియర్ ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ ధురంధర్ రూట్ ఫాలో అవుతున్నారా..? ఎక్కడి ధురంధర్.. ఎక్కడి తారక్ సినిమా.. వీటికి పోలికెక్కడుంది అనుకుంటున్నారు కదా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఒక్క విషయంలో ధురంధర్ రూట్ అయితేనే సెట్టవుతుందని నీల్ గట్టిగా నమ్ముతున్నారు. మరి ఆయన్నంతగా ఇన్‌స్పైర్ చేసిందేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? వార్ 2 ఫలితం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన ఫోకస్ అంతా నీల్ సినిమాపైనే పెట్టారు. ఈ చిత్రం కోసం చాలా మేకోవర్ అయ్యారు తారక్. అసలు గుర్తు కూడా పట్టలేనంతగా బరువు తగ్గిపోయారు. మామూలుగా తన హీరోలను లావుగానే చూపించే ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌ను మాత్రమే ఎందుకో బాగా సన్నగా మార్చేసారు. కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్, నీల్ సినిమా షూటింగ్ బ్రేక్‌లో ఉంది.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు మేకర్స్. భారీ యాక్షన్ సీక్వెన్సులు బాకీ ఉన్నాయి.. ముందు వాటిని పూర్తి చేయాలని చూస్తున్నారు నీల్. దీంతో మేజర్ యాక్షన్ పార్ట్ అయిపోతుందని తెలుస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటికొచ్చింది. ఈ సినిమా సింగిల్ పార్ట్ కాదని.. దేవర తరహాలోనే రెండు భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ సైతం తన గత సినిమాలైన కేజియఫ్, సలార్‌లను 2 పార్ట్స్‌గానే డిజైన్ చేసారు. ఇందులో కేజియఫ్ సంచలనం దేశమంతా చూసింది.. నెక్ట్స్ సలార్ 2 కూడా లైన్‌లోనే ఉంది. కాకపోతే తారక్ సినిమా విషయంలో సలార్, కేజియఫ్ సీక్వెల్స్ మాదిరి లేట్ చేయకుండా.. ధురంధర్ రూట్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చిన ఆర్నెళ్లలోపే రెండో భాగం విడుదల చేయాలని చూస్తున్నారు. ధురంధర్ పార్ట్ 1తో పాటు 2 కూడా 1000 కోట్ల క్లబ్బులో చేరింది.. సెకండ్ పార్ట్ అయితే ఏకంగా 1700 కోట్లు దాటేసింది. సేమ్ ఫార్ములా తారక్ సినిమాకు అప్లై చేయాలని చూస్తున్నారు నీల్. కుదిర్తే 2027 ఫస్టాఫ్‌లో ఫస్ట్ పార్ట్.. 2027 సెకండాఫ్‌లో 2వ భాగం రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మే 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. ఈ ఫార్మాట్ వర్కవుట్ అవుతుందో లేదో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Asha Bhosle: గాయనిగా ఆశా భోంస్లే ప్రస్థానమిది

Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా

చరణ్, బన్నీ, తారక్ మధ్య వార్.. కారణం అతడే

దేవుడి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో టాలీవుడ్ భామలు

ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్‌లు