
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమిపాలు కాని రాజస్థాన్ తమ విజయ పరంపరని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు సొంత మైదానంలో మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ స్థానంలో తుషార్ దేశ్‌పాండే, హెట్మైర్ స్థానంలో లువాన్-డ్రే ప్రెటోరియస్ ఆరంగేట్రం చేస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేసింది. హర్షల్ పటేల్ స్థానంలో ప్రఫుల్ హింగేని జట్టులోకి తీసుకుంది.
తుది జట్లు:
ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రెటోరియస్, డొనావన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.
ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగా.