Reading Time: < 1 minute
దేవుడి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో టాలీవుడ్ భామలు

వెండితెరపై గ్లామర్‌తో కుర్రకారు మతులు పోగొట్టే మన హీరోయిన్లకు దేవుడి మీద భక్తి కూడా ఎక్కువే. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు తీరిక దొరికినప్పుడల్లా ఇలా గుళ్లు గోపురాలు అంటూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. మొన్న సమంత నుంచి నేడు సారా అర్జున్ వరకు ఈ భామలంతా ఎందుకిలా ఆకస్మికంగా భక్తి మార్గం పట్టారు..? ధురంధర్ సినిమాతో ఇండియన్ ఆడియన్స్‌ను ఫిదా చేసిన సారా అర్జున్ భక్తి మార్గంలోకి వెళ్లిపోయారు. ఎంతో ఆధ్యాత్మికతో శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ కనిపించారు. ఎప్పుడు టైమ్ దొరికినా కూడా వెంటనే దేవుడి ముందు వాలిపోతున్నారు మన హీరోయిన్లు. ఆ మధ్య స్టార్ హీరోయిన్ సమంత సైతం తన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటానికి దేశమంతా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు దైవ చింతన కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా శ్రీవారి దర్శనం కోసం తిరుమల మెట్లు ఎక్కుతూనే ఉంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం తన తల్లి శ్రీదేవి బాటలోనే నడుస్తూ ఏ అకేషన్ ఉన్నా ముందుగా తిరుపతికి వెళ్లి ఆ వెంకన్న ఆశీస్సులు తీసుకుంటుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు కూడా మహా శివరాత్రి పర్వదినం వస్తే చాలు ఇషా ఫౌండేషన్‌లో భక్తి పారవశ్యంతో డ్యాన్సులు చేస్తూ శివ నామస్మరణలో లీనమైపోతారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు.. మన బ్యూటీస్ స్క్రీన్‌పై ఎంత గ్లామరస్‌గా కనిపించినా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా మాయ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్‌లు

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు

మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం

2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్‌కు నష్టాలా ??